![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1019 లో.....చలపతి, లక్ష్మి దంపతులకి ఇరవై అయిదో పెళ్లి రోజుని ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇద్దరు దండలు మార్చుకుంటారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకోవడానికి కారణం మా పిల్లలు అని చలపతి అందరికి చెప్తాడు. నాన్న ఎప్పుడు కోప్పడతాడని మా పెద్ద అబ్బాయి రాజు అనుకుంటాడు కానీ మీరు ఎక్కడ తప్పటడుగు వేస్తారోనని భయం నుండి వచ్చే కోపం అంతే అని లక్ష్మి చెప్తుంది. నా కొడుకులు ఇద్దరిని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలని ఉండేది కానీ ఒక్కరిని చదివించే స్థోమత మాత్రమే ఉంది.
అప్పుడు నా పెద్ద కొడుకు వచ్చి తమ్ముడిని ప్రెవేట్ స్కూల్ లో చదివించమని చెప్పాడు.. అప్పుడే నా కొడుకు నన్ను అర్థం చేసుకున్నాడని రాజు గురించి చలపతి గొప్పగా చెప్తాడు. తనకి పేరెంట్స్ ఉంటే వాళ్ళలా హ్యాపీగా ఉండేదాన్ని అని ఇందు బాధపడుతుంది. ఏంటి అక్క అని నందు అడుగుతుంది. నాకు అమ్మ నాన్న ఉంటే అలా హ్యాపీగా ఉండేదాన్ని అని ఇందు చెప్తుంది. మనం తెలిసో తెలియకో ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామని నందు అనగానే అంటే నీక్కూడా లేరా అని ఇందు అడుగుతుంది. ఒక్క బాబాయ్ ఉన్నాడని నందు చెప్తుంది. ఆ తర్వాత చూసావా మా నాన్న నా గురించి ఎలా గొప్పగా చెప్తున్నాడో అని రాజు అనగానే అందరి ముందు పరువుపోతుందని అలా చెప్పాడు.. నువ్వు కిడ్నాపర్ వి ఆ విషయం మర్చిపోకు అని ఇందు అంటుంది. ఆ తర్వాత అందరికి భోజనం ఏర్పాట్లు చేస్తారు. మనకి చికెన్ మిగిలించుకోవాలని లక్కీ అంటాడు. అంత కక్కుర్తి ఎందుకు ఎప్పుడు చికెన్ తినలేదా అని ఇందు కోప్పడుతుంది. నాకు ఇప్పుడు తినాలని అనిపిస్తుందని లక్కీ అంటాడు.
ఆ తర్వాత అందరికి భోజనాలు వడ్డిస్తారు. వంటలన్నీ బాగున్నాయని వచ్చినవాళ్ళు అంటారు. ఆ అమ్మాయి ఎవరు గుణవంతురాలులాగా ఉంది. ఆ అమ్మాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యొచ్చు కదా అని ఒకతను అంటాడు. మనకి అనిపించిందే వాళ్లకు కూడా అనిపించిందని లక్ష్మీతో చలపతి అంటాడు. ఆ తర్వాత చదివింపులు చదివించమని అడుగుదామని వచ్చిన డబ్బులతో చికెన్ తెచ్చుకుందామని లక్కీతో రాజు అంటాడు . లక్కీ పెన్ బుక్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఒకతను భోజనం చేసి వస్తాడు. బాబాయ్ నీకు నచ్చినంత చదివించమని రాజు అంటాడు. అప్పుడే ఇందు వచ్చి లక్కీ అని గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో సాహో వచ్చి చలపతి, లక్ష్మీ వాళ్ళ పెళ్లి రోజున కేక్ తెచ్చి కట్ చేయిస్తాడు. ఆ తర్వాత నీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నా.. నా డబ్బులు నాకు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |